ఘనంగా జడకొప్పు కోలాట ముగింపు వేడుకలు
ADB: జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఏటా కార్తీక మాసంలో నిర్వహించే జడకొప్పు కోలాట ప్రదర్శన ముగింపు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వహకులు నరిగె మోహన్, హెడావ్ లక్ష్మణ్ మాట్లాడుతూ. కాలగమనంలో ఎన్నో కళారూపాలు కనుమరుగవుతున్నాయన్నారు. ఒకప్పుడు వెలుగు వెలిగిన జానపద కళలు ఆదరణ లేకుండా అంతరించిపోతున్నాయన్నారు.