విద్యుత్ సరఫరాలో అంతరాయం
కృష్ణా: ఉయ్యూరు మండలంలోని నందమూరు ఫీడర్‌లో పీఎంఐ మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యత్ సరఫరా నిలిపివేస్తున్నాట్లు ఈఈ బి. సుధాకర్ తెలిపారు. ఇవాళ ఉదయం 7 నుంచి 10 గంటల వరకు కాటూరు, నందమూరు విద్యుత్ ఉపకేంద్రాల పరిధితో పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అయితే వినియోగదారులుస సహకరించాలని కోరారు.