మావోయిస్టులకు సహకరించొద్దు: ఎస్సై రమేష్

మావోయిస్టులకు సహకరించొద్దు: ఎస్సై రమేష్

ములుగు: వాజేడు మండలంలోని టేకులగూడెంలో స్థానిక పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై రమేష్ మాట్లాడుతూ.. గ్రామాల్లో మావోయిస్టులు సంచరిస్తే సమాచారం అందించాలన్నారు. మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.