బాటిళ్లు, బకెట్లు, క్యాన్లతో నెయ్యి కోసం ఎగబడిన జనం

బాటిళ్లు, బకెట్లు, క్యాన్లతో నెయ్యి కోసం ఎగబడిన జనం

ATP: తాడిపత్రి-కడప జాతీయ రహదారిపై నెయ్యి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీలోని నెయ్యి డబ్బాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, వాహనదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చేతికి దొరికిన బాటిళ్లు, బకెట్లు, క్యాన్లతో నెయ్యిని పట్టుకునేందుకు పోటీ పడ్డారు. ఎవరికి దొరికినంత వారు తీసుకెళ్లారు.