VIDEO: పర్వతగిరిలో క్షుద్ర పూజలు.. ప్రజల్లో ఆందోళన
WGL: పర్వతగిరి మండలంలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఇబ్బందులతో బాధపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని బాబాలు, స్వాములు రేట్లు నిర్ణయించి డబ్బు దండుకుంటున్నారు. సోమవారం నల్లకోడి, నల్ల మేకలతో, నిమ్మకాయలు పసుపుతో పూజలు నిర్వహిస్తున్న ఆనవాళ్లు మండల కేంద్రంలో బయటపడడంతో ప్రజలు భయాందోళన గురవుతున్నారు.