ఆరవ రోజుకు చేరిన కళ్యాణ బ్రహ్మోత్సవాలు

ఆరవ రోజుకు చేరిన కళ్యాణ బ్రహ్మోత్సవాలు

WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన భద్రకాళి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరవ రోజు అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయాన్నే వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి, పూజలు చేశారు. అధికసంఖ్యలో భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.