అతిధి అధ్యాపకుల కొరకు దరఖాస్తులు ఆహ్వానం

NZB: మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపకుల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దన్న తెలిపారు. రసాయనశాస్త్రం 1, కంప్యూటర్ సైన్స్ 2, ఇంగ్లీష్ 1, తెలుగు 2 సబ్జెక్టులలో బోధించుటకు దరఖాస్తులు స్వీకరించినున్నామన్నారు. దరఖాస్తులు స్వీకరించుటకు చివరి తేదీ జూలై 23గా ఉందని, ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.