విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ కూటమి విజయం
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో SFI, AISA, DSF కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో AISAకు చెందిన అదితి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా SFIకి చెందిన గోపికా బాబు, జనరల్ సెక్రటరీగా DSFకి చెందిన సునీల్, జాయింట్ సెక్రటరీగా AISAకి చెందిన డానిష్ గెలుపొందారు. దీంతో 4 ప్రధాన పోస్టులను లెఫ్ట్ కూటమి కైవసం చేసుకుంది.