నేటి నుంచి కలికిరిలో ఇస్తెమా సభలు
అన్నమయ్య: టేకలకోన వద్ద జిల్లా స్థాయి ఇస్తెమా సభలు బుధవారం ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సభలకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మంది ముస్లింలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రముఖ మతగురువులు ప్రసంగించనున్నారు. అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. సభల ప్రాంతానికి వచ్చే వాహనాలకు టోల్ ఛార్జీలు మినహాయించినట్లు అధికారులు వెల్లడించారు.