హనుమాన్ చాలీసా అరుదైన రికార్డు
భారత్‌కు చెందిన హనుమాన్ చాలీసా అరుదైన రికార్డు సృష్టించింది. యూట్యూబ్‌లో ఈ పాట ఏకంగా 5 బిలియన్ల(500 కోట్లు)కుపైగా వ్యూస్ సాధించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ పాటగా ఇది రికార్డుకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు భారతీయ భక్తి కంటెంట్‌ను ఏ విధంగా ఆదరిస్తున్నారో దీన్ని చూస్తే అర్థమవుతుంది.