'భూసార పరీక్షలకు అధిక దిగుబడులు'
MNCL: భూసార పరీక్షలతో పంటలలో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారి సురేఖ సూచించారు. గురువారం హాజీపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ అధికారులకు భూసార కిట్స్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భూసార పరీక్షలు చేయించడం వల్ల పంటలు వేసే రకాలు, అధిక దిగుబడి సాధించడానికి వీలవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు సిబ్బంది ఉన్నారు.