సక్రమంగా రెవెన్యూ సేవలు అందించాలి'

ASR: ప్రజలకు సక్రమంగా రెవెన్యూ సేవలు అందించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన హుకుంపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. తహసీల్దార్ శ్రీనివాసరావుతో మాట్లాడారు. మండలంలో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాలని సూచించారు. గిరిజనేతరుల వలస నివారణకు 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.