చీమలపాడులో జాతీయ రహదారిపై మామిడి రైతుల ధర్నా
NTR: ఏ.కొండూరు (మం) చీమలపాడులో జాతీయ రహదారిపై మామిడి రైతులు గురువారం ధర్నా నిర్వహించారు. నష్టపోయిన మామిడి రైతులను ఆదుకోవాలని కోరారు. నల్ల తెగులు, పిన్నెల్లి నల్లమంగు, మొండిపుచ్చు వంటి వ్యాధుల కారణంగా మామిడి తోటలు దెబ్బతిన్నాయన్నారు. రైతులకు ఎకరాకు లక్ష నష్టపరిహారం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.