VIDEO: ప్రజలు పరిశుభ్రత పాటించాలి : సీఎం చంద్రబాబు

KKD: ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఇవాళ ఆయన పెద్దాపురం పర్యటన సందర్భంగా పెద్దాపురం పట్టణంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో చంద్రబాబుతో పాటు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, తదితరులు పాల్గొన్నారు.