'పోలీస్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి'

SRPT: మఠంపల్లి SHO పి.బాబు గణేష్ మండప నిర్వాహకులు పోలీస్ శాఖ ప్రత్యేక పోర్టల్‌లో తప్పనిసరిగా వివరాలు నమోదు చేయాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు. భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విగ్రహాలను ప్రతిష్టించాలని చెప్పారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వాడాలని తెలియజేశారు.