ఆ పాఠశాలలో ఒకే స్టూడెంట్.. ఒకే టీచర్

ఆ పాఠశాలలో ఒకే స్టూడెంట్.. ఒకే టీచర్

SKLM: మాస్టారు చెప్పిన పాఠాలు వినాలన్నా.. రాయాలన్నా పోలాకి మండలంలో తెల్లవానిపేట బడిలో ఉన్నది ఒక్కరే విద్యార్థి. ఈ ఒకే విద్యార్థికి, ఉపాధ్యాయుడిగా సంజీవ్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థిని శ్రావణి రెండో తరగతి చదువుతోంది. గ్రామంలో పిల్లలు ప్రైవేటు స్కూల్‌కు వెళ్లడంతో ఈ ఏడాదిలో చేరికలు లేక ప్రభుత్వ బడికి ఉన్నదొక్కరే.. వచ్చిందొక్కరేలా కథ మారింది.