ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

KNR: అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో గురువారం ముందస్తు శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాల, టైనీ టాట్స్, స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్, హై స్కూల్, భగత్ నగర్ బ్రాంచ్, ప్లానెట్ కిడ్స్ పాఠశాలల్లో జరిగిన వేడుకలకు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.