నేడు తమిళనాడు, కేరళలో మోదీ పర్యటన

నేడు తమిళనాడు, కేరళలో మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఇవాళ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం కేరళలో పర్యటించి.. రూ.10,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత తమిళనాడులో రూ.5,650 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. వచ్చే నెలలో ఇరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంచరించుకుంది.