హనీ ట్రాప్.. రూ. 25లక్షల వసూలు
ATP: జిల్లాలో 'హనీ ట్రాప్' ముఠా సంచలనం సృష్టిస్తోంది. కొందరు మహిళలు వలపు వయ్యారాలతో వలపన్ని, బాధితుల నుంచి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. బాధితుల్లో వీఆర్‌ఓ, ఫిజియోథెరపిస్టు, ఆర్‌ఎంపీలు, కిరాణా వ్యాపారులు, రియల్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు తెలుపుతున్నారు.