అక్కడ మాదకద్రవ్యలు, కల్తీ ఐస్ క్రీమ్‌ల నిషేధం
NZB: కొండాపూర్ గ్రామంలో తోపుడు బండ్ల కల్తీ ఐస్ క్రీమ్‌లు, మాదక ద్రావ్యాలు, 23 సం"ల లోపు వారికి సిగరెట్, గుట్కా, పాన్ మసాలాలు విక్రయించ రాదని గ్రామ పంచాయతీ పాలక వర్గం సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీనిని అతిక్రమించిన వారికి రూ.5,000ల జరిమానా విధిస్తామని పిల్లల, ప్రజలందరి ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్, పాలక వర్గం తెలిపారు.