'చైనాతో చేసిన పొరపాటు భారత్‌తో చేయం'
రెండు దశాబ్దాల క్రితం చైనా విషయంలో చేసిన వాణిజ్యపరమైన తప్పులను భారత్ విషయంలో పునరావృతం చేయమని అమెరికా తెలిపింది. చైనాకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించి ఆ దేశాన్నే మాకు పోటీగా మార్చిన పొరపాటును భారత్‌తో చేయమని US డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ చెప్పారు. భారత్‌తో కుదుర్చుకునే ఏ ఒప్పందమైన పరస్పర ప్రయోజనం ఆధారంగానే ఉంటుందని పేర్కొన్నారు.