'లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా భద్రత అందిస్తాం'

SKLM: సంక్రాంతి పండుగకు గ్రామాలకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు సూచించారు. ఈ మేరకు గురువారం అవగాహన కల్పించారు. ఆభరణాలు వెంట తీసుకెళ్లాలని, లేనిపక్షంలో బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. సమీప పోలీస్ స్టేషన్లో గానీ తెలియజేస్తే లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా భద్రత కల్పిస్తామన్నారు.