'విశాఖ ఉక్కులో ఈవోఐలను రద్దు చేయాలి'

VSP: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం 86, 87 వార్డుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కులో 'ఈవోఐ'లను తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా కమిటీ డిమాండ్ చేసింది. సీఐటీయూ గౌరవ అధ్యక్షులు జే. అయోధ్యరామ్ మాట్లాడుతూ.. నైపుణ్యం లేని కార్మికులను నియమించడం వల్ల యంత్రాలు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.