భారీగా పెరుగుతున్న గోదావరి నది వరద ప్రవాహం

భారీగా పెరుగుతున్న గోదావరి నది వరద ప్రవాహం

BHPL: జిల్లా మహదేవపూర్ మండలం కాలేశ్వరంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో సోమవారం ఉదయం 5,66,160 క్యూసెక్కుల వరద నమోదైనట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అధికారులు మాట్లాడుతూ.. గోదావరి నదిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.