వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన
NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. రైతులకు అందుతున్న మద్దతు ధర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.