అనాధ శవానికి అంత్యక్రియలు

అనాధ శవానికి అంత్యక్రియలు

కడప: సిద్ధవటం మండలం కనుమలోపల్లి రైల్వే స్టేషన్ వద్ద 60 ఏళ్ల వయసు ఉండే వృద్ధుని శవానికి శ్రీ కాశి విశ్వనాథ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అనాధ వృద్ధుడు మృతి చెందడంతో సిద్ధవటం పోలీసులు చుట్టుపక్కల విచారించారు. అతనికి సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హిందూ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు చేశారు.