కిసాన్ డ్రోన్‌లు రైతులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ELR: కిసాన్ డ్రోన్ పథకం క్రింద కూటమి ప్రభుత్వం 80 శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. డ్రోన్లను ఇవాళ ఉంగుటూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో లబ్దిదారులకు ధర్మరాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.