'ఎమ్మెల్యేపై దుష్ప్రచారం ఆపకపోతే చట్టపరమైన చర్యలు'

ELR: ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తక్షణమే ఆపాలని జనసేన నిడమర్రు మండల అధ్యక్షుడు నిమ్మల దొరబాబు కోరారు. రాజకీయాల్లోకి రాకముందే ధర్మరాజు తన సంపాదనతో సేవా కార్యక్రమాలు చేపట్టారని, ఇప్పుడు అక్రమంగా సంపాదించాల్సిన అవసరం లేదన్నారు. అసత్యాలు ప్రచారం చేసే వారు ఆధారాలతో రావాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు ఎదురవుతాయన్నారు.