'హామీలు నెరవేర్చకపోతే చెప్పులు మెడలో వేసుకొని రాజీనామా చేస్తా'

'హామీలు నెరవేర్చకపోతే చెప్పులు మెడలో వేసుకొని రాజీనామా చేస్తా'

SRCL: ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కులానికి ఒక చెప్పు చొప్పున మెడలో వేసుకుని రాజీనామా చేస్తానని ఓ సర్పంచ్ అభ్యర్థి బాండ్ రాసివ్వడం చర్చనీయాంశమైంది. చెంజర్ల గ్రామంలో రాజేశ్వరి అనే మహిళ తనను గెలిపిస్తే 12పడకల ఆస్పత్రి, మినీ ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్ ఏర్పాటుతో పాటు కోతుల సమస్యను పరిష్కరిస్తానని బాండుపై రాసిచ్చారు. 3ఏళ్లలో వీటిని పూర్తిచేయకపోతే రాజీనామా చేస్తానన్నారు.