రైతులకు సబ్సిడీపై శనగలు అందించాలి : మస్తాన్ రెడ్డి
KDP: వర్షాలు కురుస్తున్నందున రబీ కింద శనగపంట వేసేందుకు రైతులు ఆసక్తిగా ఉన్నారని YCP రైతు విభాగ ప్రధాన కార్యదర్శి మస్తాన్ రెడ్డి తెలిపారు. సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సబ్సిడీ శనగల ధరలు ప్రకటించి రెండు వారాలు గడుస్తున్నా వాటిని ఎప్పుడు పంపిణీ చేస్తారో చెప్పకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. సబ్సిడీపై శనగలు అందజేయాలని డిమాండ్ చేశారు.