యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
BHNG: భువనగిరి పట్టణంలోని హన్మాపురంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఏబిసి సెంటర్లోని ఉన్నటువంటి సౌకర్యాలను పరిశీలించి, జిల్లాలోని 5 పురపాలక సంఘాలకు సంబంధించిన వీధి కుక్కలకు ఇక్కడే స్టేరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయుటకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.