దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ
NZB: జిల్లా దుబ్బాలో రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్సిఎఫ్) ఆధ్వర్యంలో శనివారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువులకు ఉచిత టీకాలు, పౌష్టిక ఆహారం ప్యాకెట్లు అందించారు. 72 పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స చేయగా, 72 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.