రగ్గులు పంపిణీ చేసిన వైసీపీ నాయకులు
VZM : వైసీపీ నియోజకవర్గ యువజన, విద్యార్థి విభాగాల ఇంఛార్జ్ కౌశిక్ ఈశ్వర్ జన్మదినాన్ని YCP యువజన, విద్యార్థి విభాగాల నాయకులు కలసి ఘనంగా నిర్వహించారు. శనివారం ఆయన పేరు మీద శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, పేదలకు రగ్గులు పంపిణీ చేశారు.