'ఇండ్ల నిర్మాణాలను త్వరతిగతిన పూర్తి చేయించండి'

CTR: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో చేపట్టిన ఇండ్ల నిర్మాణంలో భాగంగా వివిధ దశలలో ఉన్న ఇంటి నిర్మాణాల పనులను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా సచివాలయంలో నుండి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు.