రేపటితో ముగియనున్న ధాన్యం కొనుగోళ్లు

శ్రీకాకుళం: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు గడువు రేపటితో ముగియనుంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో మార్చి 29వ తేదీ నాటికి జిల్లాలో 4,49,506 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి నాటికి 4.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ ఏడాది తక్కువగా కొనుగోలు జరిగింది. అయితే గడువు పెంచాలని రైతులు కోరారు.