రోజ్ వాటర్ తాగుతున్నారా?
ఎన్నో ఔషధ గుణాలు గల రోజ్ వాటర్‌ని ఎక్కువగా చర్మ సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరమేనని నిపుణులు చెబుతున్నారు. రోజూ రోజ్ వాటర్ తాగితే ఇమ్యూనిటీ, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుందని అంటున్నారు. అలాగే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందని, వ్యర్థపదార్థాలను తొలగించేందుకు డిటాక్స్‌గా పనిచేస్తుందని సూచిస్తున్నారు.