గొర్రెను కాపాడే యత్నంలో యువకుడి మృతి
SRPT: మఠంపల్లి మండలం కల్వపల్లి తండాలో ఇవ్వాళ విషాదం చోటుచేసుకుంది. చెరువులో వలలో చిక్కుకున్న గొర్రెను రక్షించేందుకు వెళ్లిన రవీందర్ నాయక్ (35), అదే వలలో కాలు చిక్కుకోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.