వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్‌ను సత్కరించిన మంత్రి

HNK: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎల్కతుర్తి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుకినే సంతాజీ, వైస్ ఛైర్‌పర్సన్ బొక్కల స్రవంతి, డైరెక్టర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి సత్కరించారు. మార్కెట్ అభివృద్ధి కోసం కృషి చేయాలని, సత్వర నిర్ణయలను తీసుకుని అమలు చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.