పదవులు రాలేదని అసంతృప్తి చెందవద్దు: ఎమ్మెల్యే

E.G: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు రాకపోయినా కాస్త ఓపిక పట్టాలని, తగిన సమయంలో వారికి గుర్తింపునిచ్చి ఉన్నతమైన పదవులు కట్టబెడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శ్రీ నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. అనంతరం నూతన పాలక మండలికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.