హరీష్ రావును పరామర్శించిన తోటపల్లి గ్రామస్తులు
SDPT: ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తోటపల్లి గ్రామ ప్రజలు పరామర్శించారు. తాజా మాజీ సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు నేతృత్వంలో మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రతినిధుల బృందం హరీష్ రావును కలిసి ఆయన తండ్రి సత్యనారాయణ రావు మరణంపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.