హనుమంతరాయ చౌదరి మృతి పట్ల సీఎం దిగ్భ్రాంతి
ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హనుమంతరాయ చౌదరి మరణం టీడీపీకి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. హనుమంతరాయ ప్రజలకు, పార్టీకు చేసిన సేవలను గుర్తు చేశారు. నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు.