రణరంగంగా టెహ్రాన్.. 10 మంది మృతి
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో బాసిజ్ మిలీషియా సభ్యులు సహా కనీసం 10 మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. టెహ్రాన్‌లోని పలు జిల్లాల్లో ఉన్న మిలిటరీ చెక్‌పోస్టులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. మొసాద్, రాచరిక మద్దతుదారులే ఈ దాడులకు పాల్పడ్డారని ఇరాన్ ఆరోపిస్తోంది.