కంటిలో బ్యాక్టీరియా.. పెరుగుతున్న యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్
HYDలోని CCMB నిర్వహించిన తాజా అధ్యయనంలో కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాల్లో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ గణనీయంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. పరిశోధనలో సుమారు 45% వరకు బ్యాక్టీరియా మందులకు ప్రతిరోధకంగా మారినట్లు గుర్తించారు. ఈ పరిస్థితి చికిత్సను క్లిష్టతరం చేస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.