స్టంట్ మెన్ టూ హీరోగా మారిన చొప్పెల్ల యువకుడు
కోనసీమ: ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామానికి చెందిన అభిలాశ్ సుంకర హీరోగా నటించిన నూతన చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన, సుమారు 400 చిత్రాల్లో స్టంట్ మాస్టర్‌గా పనిచేసి అపార అనుభవం గడించారు. కష్టపడి హీరో స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు