'సమాచార విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ'

HNK: డీసీసీ భవన్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమాచార విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.