అక్రమంగా గుడుంబా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
WGL: సంగెం మండలం వడ్డెరగూడెం సమీపంలో ఆదివారం ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏనుగల్లు గ్రామానికి చెందిన లోతు సంతోష్ అక్రమంగా.. తరలిస్తున్న 6 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడుపై కేసు నమోదు చేసి, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.