హోంగార్డ్‌ను అభినందించిన ఎస్పీ

హోంగార్డ్‌ను అభినందించిన ఎస్పీ

SKLM: జిల్లాకు చెందిన హోంగార్డ్ ఎం. మహాదేవ్ సంజీవ రావు రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రజతం సొంతం చేసుకున్నారు. విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్ ఐటీ కళాశాలలో ఈనెల 4, 5 తేదీల్లో జరిగిన ఈ పోటీలలో సంజీవరావు పాల్గొని తన ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు సోమవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆయనను అభినందించారు.