భారత పుత్రికలు చరిత్ర సృష్టించారు: మోదీ

భారత పుత్రికలు చరిత్ర సృష్టించారు: మోదీ

క్రికెట్‌లో భారత పుత్రికలు చరిత్ర సృష్టించారని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశ మహిళల్లో ఆత్మవిశ్వాసానికి చిహ్నమని పేర్కొన్నారు. భారత మహిళా జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ విజేతగా నిలవడంపై ఆయన స్పందించారు. బీహార్‌లోని సహర్సాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.