VIDEO: చెరువుకొమ్ము తండాలో రాజకీయ ఘర్షణ

VIDEO: చెరువుకొమ్ము తండాలో రాజకీయ ఘర్షణ

WGL: చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిన్న రాత్రి సర్పంచ్ ఎన్నికల అంశంపై మాటల తూటాలు చెలరేగి, వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. చలిమంటల కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.