కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్ల ఏర్పాటు
HNK: అమృత్ భారత్ రైల్వే స్టేషన్‌ల అభివృద్ధి పథకంలో భాగంగా కాజీపేట రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే పనులు వేగంగా సాగుతున్నాయి. 1వ, 2వ ప్లాట్‌ఫారమ్‌లపై ఎస్కలేటర్ల ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. ఆధునికంగా నిర్మిస్తున్న కొత్త కాలినడక వంతెన పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ప్రయాణికుల కోసం ర్యాంపులు, రెండు వైపులా లిఫ్టులు ఏర్పాటు చేశారు.